"World War 3": చెడు అంటే మూడో ప్రపంచ యుద్ధమే- దిమిత్రి

by Shamantha N |

పుతిన్‌ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్ దేవ్ ఖండించారు. చెడు ఏదైనా జరుగుతుందంటే అది కేవలం మూడో ప్రపంచ యుద్ధమే (WWIII) అని తాను నమ్ముతున్నట్లు దిమిత్రి పేర్కొన్నారు.

World War 3: చెడు అంటే మూడో ప్రపంచ యుద్ధమే- దిమిత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: పుతిన్‌ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్ దేవ్ ఖండించారు. చెడు ఏదైనా జరుగుతుందంటే అది కేవలం మూడో ప్రపంచ యుద్ధమే (WWIII) అని తాను నమ్ముతున్నట్లు దిమిత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌ అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. పుతిన్‌పై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) నిప్పుతో ఆడుకుంటున్నారని, తాను అధ్యక్షుడి స్థానంలో లేకుంటే రష్యాకు చాలా చెడు జరిగి ఉండేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపైనా దిమిత్ర మెద్వ్ దేవ్ స్పందించారు.

రష్యా- ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ

రష్యా- ఉక్రెయిన్‌ (Ukrain) మధ్య కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరుగుతున్నప్పటికీ మాస్కో కీవ్‌పై భారీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే రష్యా తమ దేశంపై 900లకు పైగా డ్రోన్‌ దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ దాడులను చూస్తుంటే పుతిన్‌కు యుద్ధాన్ని ఆపే ఉద్దేశం ఉన్నట్లు లేదని అన్నారు. కీవ్‌పై మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధం అవుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయని వాపోయారు. ఇకనైనా దాడులకు పాల్పడకుండా రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్‌లు ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని కోరారు. దీంతో, పుతిన్ పై ట్రంప్ విమర్శలు చేశారు. పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నారు. ఇలాగే చేస్తే రష్యా తీవ్ర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మాస్కోను హెచ్చరించారు.

Next Story