Meenakshi Huda: ఆటో డ్రైవర్ కూతురు.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్

by Prasad Jukanti |   (  Updated:2025-09-14 12:49:58  IST  )

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు మరో స్వర్ణ పతకం లభించింది.

Meenakshi Huda: ఆటో డ్రైవర్ కూతురు.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: యునైటెడ్ కింగ్ డమ్ లివర్ పూల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణ పతకం లభించింది. బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్ లో మీనాక్షి హుడా స్వర్ణపతకం గెలిచి అదరగొట్టింది. కజకిస్థాన్ ప్లేయర్ పై మీనాక్షి 4-1 తేడాతో విజయం సాధించింది.తొలిసారి ప్రపంచ చాంపియన్ షిప్ బరిలో దిగిన మీనాక్షి హుడా స్వర్ణ పోరుకు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్ లో బంగారు పతకం సాధించింది. అంతకు ముందు శనివారం జరిగిన సెమీ పైనల్ లో మంగోలియాకు చెందిన లుత్సైఖనీ అల్టాన్ సెట్సెగ్ ను చిత్తుగా ఓడించింది.

ఆటో డ్రైవర్ కూతురు.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్:

హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని రూర్కీ కిలోయ్ గ్రామానికి చెందిన మీనాక్షి హడా తండ్రి శ్రీకృష్ణన్ ఓ ఆటోడ్రైవర్. మీనాక్షికి బాక్సింగ్ పట్ల ఆసక్తి ఉన్నా పేదరికం కారణంగా అందుకు అతడు అనుమతి ఇవ్వలేదు. కానీ శ్రీకృష్ణన్ ను ఆటలకు పంపించాలని ఆమె కోచ్ విజయ్ ఒప్పించారు. కోచ్ విజయ్ కారణంగా ఆ తర్వాత తన కూతురికి శ్రీకృష్ణన్ సైతం అండగా నిలిచాడు. తన ఆటో రిక్షాలో అకాడమికీ తీసుకువెళ్లేవాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మీనాక్షి హుడా చెతులకు తొడుక్కునే గ్లౌజ్ లు సైతం రెంట్ కు తెచ్చుకునేది. ఆ తర్వాత కెరీర్ లో విజయాలు సాధించడంతో ఆమెకు స్పోర్ట్స్ కోటాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ గా ప్రభుత్వ ఉద్యోగం లభించింది. దాంతో అప్పటి వరకు రోజు వారి అద్దెకు ఆటో నడిపే ఆమె తండ్రి సెకండ్ హ్యాండ్ లో సొంతంగా ఆటో కొనుగోలు చేశాడు. అలాగే ఈ ఉద్యోగం వారి కుటుంబానికి ఆర్థిక అండ ఇవ్వడంతో అప్పటి నుంచి మీనాక్షి పూర్తి స్థాయిలో ఆటపై దృష్టి పెట్టింది. క్రమంలో కెరీర్ లో దూసుకువస్తున్నమీనాక్షి 2023, 2024లో సీనియర్ నేషనల్స్ లో స్వర్ణం గెలిచింది. తాజాగా ప్రపంచ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచి అరదరగొట్టింది.

Next Story