RTC బస్సులో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు (వీడియో)

by Disha Web Desk 2 |
RTC బస్సులో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో బస్సుల్లో సీట్ల కోసం మహిళ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళల మధ్య ఫైటింగ్ జరిగింది. అందరూ చూస్తుండగానే బస్సులోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో వైపు ఫ్రీ జర్నీ స్కీం వల్ల ఇలాంటి గొడవలు తరచూ జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Next Story