- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైరస్ ఇంజెక్ట్ చేసి, ముఖంపై మూత్రం పోశారు.. బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ సంచలన ఆరోపణలు
కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆయన అనుచరులపై ఓ 40ఏళ్ల మహిళ సంచలన ఆరోపనలు చేశారు. తనపై ఎమ్మెల్యే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు.

దిశ,వెబ్ డెస్క్: కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆయన అనుచరులపై ఓ 40ఏళ్ల మహిళ సంచలన ఆరోపనలు చేశారు. తనపై ఎమ్మెల్యే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతే కాకుండా తనకు వైరస్ ఇంజెక్ట్ చేయడంతో పాటూ తన ముఖంపై మూత్రం పోశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సదురు మహిళ బీజేపీ ఎమ్మెల్యేపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతేడాది జూన్ 11న మతికేరే లోని ఎమ్మెల్యే ఆఫీసులో ఈ ఘటన జరిగిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనను ఎమ్మెల్యే మునిరత్న కారులో ఆఫీసుకు తీసుకువెళ్లాడని చెప్పారు. అక్కడ తనపై అత్యాచారం జరిగిందని పేర్కొన్నారు. తాను ప్రతిఘటించినప్పటికీ ఎమ్మెల్యే ఆయన ఇద్దరు అనుచరులు బలవంతంగా దుస్తులు విప్పి, మాట వినకపోతే నీ కొడుకును చంపేస్తామని బెదిరించారని తెలిపారు. తరవాత మునిరత్నం తనపై అత్యాచారం చేయాలని ఇద్దరు వ్యక్తులను ఆదేశించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తరవాత గదిలోకి తీసుకెళ్లి ఎమ్మెల్యే తనకు ఓ పెట్టెలోని ఇంజెక్షన్ తీసి ఎక్కించారని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో తాను ఆస్పత్రిలో చేరగా నయం చేయలేని వైరస్ బారినపడినట్టు నిర్ధారణ అయిందని చెప్పారు. ఆ ఇంజెక్షన్ వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. ఇదిలా ఉంటే సదరు మహిళ మే 19న కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యాయత్యం చేశారు. దీంతో పోలీసులు ఆమెను విచారించగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే మునిరత్న ఇప్పటి వరకు స్పందించలేదు.






