- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమానంలో 11A సీట్ కోసం మహిళ రచ్చ..వీడియో వైరల్
విమానంలో 11ఏ సీట్ ఉపయోగం ఏంటో అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరవాత ప్రతిఒక్కరికీ తెలిసింది.

దిశ, వెబ్ డెస్క్: విమానంలో 11ఏ సీట్ ఉపయోగం ఏంటో అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరవాత ప్రతిఒక్కరికీ తెలిసింది. 242 మంది ఉన్న విమానంలో కేవలం 11ఏ సీట్ వద్ద ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ సీటు ప్రాముఖ్యత తెలిసివచ్చింది. విమాన ప్రయాణం చేసేవాళ్లు ముందుగా 11ఏ సీట్ బుక్ చేసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ సీటు కోసం గొడవలు కూడా మొదలయ్యాయి. తాజాగా 11ఏ సీట్ కోసం ఓ మహిళ విమానంలో రచ్చ చేయగా వీడియో వైరల్ అవుతోంది.
అందులో మహిళ మరాఠీ మాట్లాడటంతో ఈ ఘటన ముంబాయిలో జరిగిందని అనుమానిస్తున్నారు. సదరు మహిళ ఇద్దరు వృద్ధులతో సీటు కోసం గొడవ పడటంతో అక్కడికి చేరుకున్న ఎయిర్ హోస్టెస్ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ తగ్గకుండా వృద్ధులను మరాఠీలో ఎలా పడితే అలా తిట్టేస్తూ వేలు చూపిస్తోంది. ఇక పక్కనే ఉన్న ఆమె కుమారుడు అందరూ చూస్తున్నారు పరువు పోతుందని మమ్మీ వదిలేయు అని చెప్పినా వినకుండా అతడిని ఎలా పడితే అలా కొట్టేస్తుంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు.






