నీటి కోసం మహిళల కష్టాలు.. దాహం తీరాలంటే బావిలో దిగాల్సిందే

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-21 12:40:53  IST  )

టెక్నాల‌జీ ఎంత అభివృద్ధి చెందినా గ్రామాల్లో నీటి క‌ష్టాలు మాత్రం తీరడం లేదు. ఎండాకాలం

నీటి కోసం మహిళల కష్టాలు.. దాహం తీరాలంటే బావిలో దిగాల్సిందే
X

దిశ‌, వెబ్ డెస్క్: టెక్నాల‌జీ ఎంత అభివృద్ధి చెందినా గ్రామాల్లో నీటి క‌ష్టాలు మాత్రం తీరడం లేదు. ఎండాకాలం వ‌చ్చిందంటే ఆరిన గొంతులు త‌డుపుకునేందుకు ప్రాణాల మీద‌కు తెచ్చుకుని సాహ‌సం చేయాల్సిన ప‌రిస్థితులు వ‌స్తుంటాయి. తాజాగా మ‌హారాష్ట్రాలోని ఓ గ్రామంలో అలాంటి ప‌రిస్థితులే ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. మ‌హిళ‌లు నీళ్ల కోసం తాళ్లు ప‌ట్టుకుని బావిలోకి దిగుతున్నారు. అంత రిస్క్ చేసినా దొరికేది కూడా మురికి నీళ్లే. బావి చుట్టూ చాలా మంది మ‌హిళ‌లు బిందెలు ప‌ట్టుకుని నిల‌బ‌డ‌గా బావిలో మాత్రం నీళ్లు త‌క్కువ‌గానే ఉన్నాయి. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న నాసిక్ జిల్లాలోని పెత్ తాలూకా బోరిచివాడిలో చోటు చేసుకుంది. వీడియో చూసిన నెటిజన్లు మంచినీటి కోసం అంత రిస్క్ చేయాలా.. నీటి విలువ తెలియనివారు ఎంత నీటిని వేస్ట్ చేస్తారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Click For tweet Post..

Next Story