- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాట్ బెడ్డింగ్‌తో డబ్బు సంపాదిస్తున్న మహిళ..నెల ఆదాయం ఎంతంటే?
డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఏ పనిచేసినా కష్టపడకుండా డబ్బులు రావు.

దిశ, వెబ్ డెస్క్: డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఏ పనిచేసినా కష్టపడకుండా డబ్బులు రావు.కానీ ఓ మహిళ అసలు ఏ పనిచేయకుండా నెలకు రూ.54 వేలు సంపాదిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్‌కు చెందిన 38 ఏళ్ల మోనిక్ జెరేమియా కరోనా సమయంలో వ్యాపారం దెబ్బ తినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఆమె చేసిన ఆలోచనతో ఇప్పుడు నెలకు రూ.54వేలు సంపాదిస్తోంది. అయితే ఆమె చేస్తున్న పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
రూమ్ షేరింగ్ అంటే అందరికీ తెలుసు కానీ మోనిక్ జెరేమియా బెడ్ షేరింగ్ చేస్తోంది. అంటే తన బెడ్ పై పక్కన మరొకరు పడుకునేందుకు అవకాశం ఇస్తుంది. ఇలా బెడ్ షేర్ చేసుకోవడాన్ని హాట్ బెడ్డింగ్ (Hot bedding) అంటారట. హాట్ బెడ్డింగ్‌లో ఎవరైనా బెడ్ షేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇద్దరి మధ్య ఎలాంటి ఎమోషనల్ రిలేషన్షిప్ ఉండదు. అంతే కాకుండా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ షిప్ కూడా ఉండదు. నగరాల్లో అద్దెలు కట్టలేక ఎలా అయితే రూం షేరింగ్ చేసుకుంటారో అచ్చం అలాగే అన్నమాట.
బెడ్ షేరింగ్‌లో ఒకేసారి ఇద్దరు బెడ్ పై పడుకోవచ్చు. లేదంటే షిఫ్టులు మారినా వారి వారి సమయాలను బట్టి పడుకోవచ్చు. ప్రస్తుతం హాట్ బిడ్డింగ్ ద్వారా తనకు ఆదాయం సరిపడా వస్తోందని మెనిక్ చెబుతున్నారు. పెరుగుతున్న ధరలతో తాను కూడా హాట్ బిడ్డింగ్ ధరలను పెంచుతానని చెబుతున్నారు. ప్రస్తుతం మోనిక్ హాట్ బెడ్డింగ్ గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో అక్కడ అంటే అమ్మాయి పక్కన ఉంటుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు. అదే అబ్బాయిలు హాట్ బెడ్డింగ్ అని మొదలు పెడితే ఒక్క కస్టమర్ కూడా కనిపించరు అని కామెంట్లు పెడుతున్నారు.






