- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరకొంగు చించి సీఎంకు రాఖీ కట్టిన మహిళ
ఇటీవల ఉత్తరాఖండ్ లోని ధారాలిలో క్లౌడ్ బరస్ట్ కావడంతో భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఉత్తరాఖండ్ లోని ధారాలిలో క్లౌడ్ బరస్ట్ కావడంతో భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి, రాళ్లు, బురద ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ ఘటనపై తక్షణమే స్పందించి, వేగంగా సహాయకచర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో బురదలో చిక్కుకుపోయిన వందలమంది గ్రామస్తులను విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. ప్రమాదం జరిగిన ధారాలితో సహా పలు గ్రామాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ అహ్మదాబాద్‌కు చెందిన యాత్రికురాలు ధన్‌గౌరీ బరోలియా, సీఎం ధామీకి కృతజ్ఞతగా తన చీరకొంగు చించి రాఖీగా కట్టింది.
ఈ అనుకోని హృదయాన్ని హత్తుకునే సంఘటనతో సీఎం సహా అక్కడివారంతా భావోద్వేగానికి గురయ్యారు. స్వయంగా శ్రీకృష్ణుడే ధామి రూపంలో వచ్చి తన చెల్లెళ్లను రక్షించాడని ధన్‌గౌరీ కన్నీటి పర్యంతం అయింది. ఆగస్టు 5న జరిగిన ఆ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వం, NDRF, SDRF, భారత సైన్యం, ITBP బృందాలు విపత్తు బాధితులను కాపాడడానికి హెలికాప్టర్లతో సహా వేగవంతమైన రక్షణ కార్యకలాపాలు చేపట్టడంతో భారీగా ప్రాణనష్టాన్ని నివారించగలిగారు.






