కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళపై అత్యాచారం.. దుమారం రేపుతున్న వీడియో

by Sujitha Rachapalli |

తన సోదరుడితో ఆస్తి గొడవల కారణంగా అడ్వకేట్ జలాలుద్దీన్‌ను కలిసింది ఓ మహిళ. కచ్చితంగా న్యాయం చేస్తానని హామి ఇచ్చిన ఆయన.. అప్పటి నుంచి తన ఇంటికి రావడం మొదలుపెట్టాడని.. ఒకరోజు తనకు హెల్త్ బాగాలేనప్పుడు

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళపై అత్యాచారం.. దుమారం రేపుతున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: తన సోదరుడితో ఆస్తి గొడవల కారణంగా అడ్వకేట్ జలాలుద్దీన్‌ను కలిసింది ఓ మహిళ. కచ్చితంగా న్యాయం చేస్తానని హామి ఇచ్చిన ఆయన.. అప్పటి నుంచి తన ఇంటికి రావడం మొదలుపెట్టాడని.. ఒకరోజు తనకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంటికి వచ్చి బయటకు తీసుకెళ్లాడని తెలిపింది. తనపై నమ్మకంతో వెళ్లానని.. కానీ ఆగ్రాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి.. తనకు గన్ చూపించి బెదిరించి.. అత్యాచారం చేశాడని చెప్పింది. బయట ఎవరికైనా ఈ విషయం చెప్తే చంపేస్తానని.. తనకు చాలా పెద్ద పెద్దోళ్లు తెలుసని వార్నింగ్ ఇచ్చాడని తెలిపింది.

ఆ తర్వాత తన ఇంటకి వస్తూ పోతూనే ఉన్నాడని.. 2019 నుంచి ఇప్పటి వరకు టార్చర్ చేస్తూనే ఉన్నాడని తెలిపింది. ఆయనకు భయపడి బయట లాక్ చేసుకుని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధపడింది. ఇంటికొచ్చి తిని, తాగి, పడుకోవడమే కాదు తమ ఇంట్లో నమాజ్ చేస్తూ.. తమతో బలవంతంగా చేయించవాడని.. ఉపవాసం కూడా చేయాలని బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది. తమకు న్యాయం చేయాలని కోరింది.

VIDEO

Next Story