ఏందక్కా మరీ ఇలా ఉన్నావ్..! పానీ పూరీ ధర్నా.. నడిరోడ్డుపై యువతి నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్

by Ramesh Naini |

ఏందక్కా మరీ ఇలా ఉన్నావ్..! పానీ పూరీ ధర్నా.. నడిరోడ్డుపై యువతి నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Pani Puri Dharna) పానీ పూరీ లేదా గప్‌చుప్‌లు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, యువతకు పానీ పూరీలు అంటే మక్కువ ఎక్కవే. మంచిగా ఉండే గప్‌చుప్‌ల కోసం ఎంత దూరమైన పోతారు. పానీ పూరీలో ఏదీ తక్కువ అయిన వారు సహించరు. ఈ నేపథ్యంలోనే పానీ పూరీ కోసం రోడ్డుపై నిరసన తెలిపిన యువతి సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.20 ప్లేట్‌లో తనకు రెండు పూరీలు తక్కువ వచ్చాయని పానీపూరీ యజమానిపై కోపంతో యువతి నడి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. పానీ పూరీ విక్రయించే వ్యక్తి ఆరు పూరీల్లో రెండు తక్కువ ఇచ్చి మోసం చేశాడంటూ యువతి కన్నీరు మున్నీరు అయింది. ఈ వింత ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది.

వైరల్ వీడియో ప్రకారం.. యువతి రోడ్డుపై నిరసనకు దిగడంతో రద్దీగా ఉండే సుర్సాగర్ సరస్సు ప్రాంతానికి సమీపంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా మంది ఆమె వద్దకు వచ్చి మొబైల్‌లో వీడియోలు తీయడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పానీ పూరీ విషయంలో నిరసన తెలియజేసినట్లు పోలీసులకు కన్నీళ్లు పెట్టుకోని మరీ చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరికి ఆమెను పోలీసులు రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే పానీ పూరీల బండి వ్యక్తి నుంచి మిగిలిన పూరీలు ఇప్పించారా? లేదా? అనేది తెలియరాలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సంఘటనపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. ఏందక్కా మరీ ఇలా ఉన్నావ్.. రెండు పానీ పూరీ కోసం ధర్నా చేయడం ఏమిటి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘రెండు పానీ పూరీల కోసం సత్యాగ్రహ దీక్ష’ అంటూ మరో వ్యక్తి కామెంట్ హైలెట్‌గా నిలిచింది. ఇష్టంగా తినే పానీ పూరీల విషయంలో అక్కకు న్యాయం జరగాలని పలువురు నెటిజన్‌లు డిమాండ్ చేశారు. ట్వీట్ లింక్..

Next Story