వంటలో నీటికి బదులు యాసిడ్ పోసిన మహిళ.. ఆస్పత్రిపాలైన ఆరుగురు

by Naga Rani Yarlagadda |

కుటుంబ సభ్యులందరికీ వంట చేసిన మహిళ.. కూరలో నీటికి బదులుగా యాసిడ్ పోసింది.

వంటలో నీటికి బదులు యాసిడ్ పోసిన మహిళ.. ఆస్పత్రిపాలైన ఆరుగురు
X

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ సభ్యులందరికీ వంట చేసిన మహిళ.. కూరలో నీటికి బదులుగా యాసిడ్ పోసింది. దీంతో ఆ ఆహారం తిన్న ఆరుగురు కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని మిద్నాపోర్ జిల్లాలో జరిగింది. బాధితులు ఘటల్ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కలకత్తాకు తరలించారు.

రత్నేశ్వర్ భాటికి చెందిన సంతు అనే వ్యక్తి సిల్వర్ జ్యూయలరీకి సంబంధించిన పనులు చేస్తుంటాడు. అతను చేసే పనిలో సాధారణంగా యాసిడ్ వాడతారు. అందుకే ఇంట్లో పెద్దమొత్తంలో యాసిడ్ నిల్వ ఉంచారు. ఆదివారం (నవంబర్ 23) ఇంట్లో మహిళ కుటుంబం మొత్తానికీ ఆహారం వండుతూ పొరపాటున మంచినీటికి బదులుగా వంటలో యాసిడ్ పోసింది. మంచినీరు, యాసిడ్ నిల్వ ఉన్న కంటైనర్లు ఒకేలా ఉండటంతో ఆమె గ్రహించలేకపోయింది.

మధ్యాహ్నం భోజనం తర్వాత ఉన్నట్లుండి అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఘటల్ హాస్పిటల్ కు తరలించగా.. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపునొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడినట్లు వైద్యులు తెలిపారు. యాసిడ్ వంటి డేంజరస్ లిక్విడ్స్ వృత్తి రీత్యా స్టోర్ చేసుకోవాలనుకునేవారు వాటిని పిల్లలకు, వంటగదికి దూరంగా ఉంచాలని సూచించారు.

Next Story