అస్సాం సీఎంకు ముద్దు పెట్టిన మహిళ

by velandi.Saikiran |

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ముద్దు పెట్టింది ఓ మహిళ. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

అస్సాం సీఎంకు ముద్దు పెట్టిన మహిళ
X
దిశ‌, వెబ్ డెస్క్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు ( CM Himanta Biswa Sarma) ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్న సీఎం హిమంతకు ఓ లేడీ బుగ్గ పైన ముద్దు పెట్టింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రెస్ మీట్ పెడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని లిఖింపూర్ జిల్లాలో సీఎం హిమంత బిస్వా శర్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. దీంతో పెద్ద ఎత్తున మహిళా అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఓ మహిళ అత్యుత్సాహం ప్రదర్శించి, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుగ్గ పైన ముద్దు ( Woman kiss) పెట్టింది. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆయన్ని దగ్గరకు లాక్కొని బుగ్గపై ముద్దు పెట్టిన మహిళా అభిమాని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన జ‌నాలు షాక్ అవుతున్నారు.

Next Story