- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Super commuter: విధులకు హాజరయ్యేందుకు రోజూ 700కి.మీ. ప్రయాణం చేస్తున్న మహిళ
సాధారణంగా ఆఫీసులు 20- 30 కిలోమీటర్లు ప్రయాణిస్తాం.. ఏ బస్సులోనే, కార్లోనే వెళ్తాం. కానీ మలేసియాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన మహిళ మాత్రం రోజూ 700 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ విధులకు హాజరువుతన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: సాధారణంగా ఆఫీసులు 20- 30 కిలోమీటర్లు ప్రయాణిస్తాం.. ఏ బస్సులోనే, కార్లోనే వెళ్తాం. కానీ మలేసియాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన మహిళ మాత్రం రోజూ 700 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ విధులకు హాజరువుతన్నారు. దీంతో ఆమెను "సూపర్ కమ్యూటర్" (సూపర్ ప్రయాణికురాలు) అని పిలుస్తున్నారు. కాగా.. మలేసియాకు చెందిన రాచెల్ కౌర్.. ఎయిర్ ఏసియా కంపెనీలో పైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు రోజూ వెళ్లివస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంటర్వ్యూతో ఆమె స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
రోజూ 700 కిలోమీటర్ల ప్రయాణం
రాచెల్ కౌర్‌కు 11, 12 ఏళ్ల వయసుగల ఇద్దరు పిల్లలు. ఆమె మలేసియాలోని పెనాంగ్‌లో నివసిస్తున్నారు. అయితే, ఆమె ఆఫీస్ కౌలాలంపూర్‌లో ఉంది. గతంలో ఆమె ఆఫీసుకు దగ్గరగా అద్దె ఇంట్లో ఉండేవారు. అలా ఉండగా వారానికి ఒక్కరోజు మాత్రమే పిల్లల్ని చూడగలిగేవారు. ఇదే కారణంగా ఆమె నిర్ణయం మార్చుకుని రోజూ విమాన ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి, 5 గంటలకల్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటానని కౌర్ చెప్పారు. ఉదయం 5:55కి విమానం ఎక్కి, 7:45 కల్లా ఆఫీసుకు చేరుకుంటారు. విధులు ముగించుకుని రాత్రి 8 గంటలలోపు తిరిగి ఇంటికి చేరుకుంటానని అన్నారు. దీంతో, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుందన్నారు. పిల్లలతో గడిపే క్షణాలే తనకెంతో ఆనందాన్నిస్తున్నాయని తెలిపారు. ఒకప్పటి కంటే ప్రస్తుతం ప్రయాణంతో ఎక్కువ ఆదా అవుతోందని కౌర్ అంటున్నారు. కౌలాలంపూర్‌లో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు నెలకు 474 డాలర్లు (సుమారు రూ. 42,000) ఖర్చు అవుతున్నట్లు చెప్పారు. కానీ, ఇప్పుడు విమాన ప్రయాణం చేసినా 316 డాలర్లు (రూ. 28,000) మాత్రమే ఖర్చవుతోందని తెలిపారు. అంతేకాదు, ప్రయాణ సమయంలో తనకు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించడమే కాకాం, ఆఫీసుకు వెళ్లే ముందు కొంతసేపు నడవడం అలవాటు చేసుకున్నానని చెప్పారు. అయితే, కౌర్ ప్రయాణ విధానం గురించి తెలుసుకున్నవారు ఆశ్చర్యపోతున్నారు.






