- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kerala : అటవీ అధికారుల నిర్లక్ష్యం.. పులి దాడిలో మహిళ మృతి
అటవీ అధికారుల నిర్లక్ష్యం వలన పులి దాడి(Tiger Attack)లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

దిశ, వెబ్ డెస్క్ : అటవీ అధికారుల నిర్లక్ష్యం వలన పులి దాడి(Tiger Attack)లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అధికారుల బాధ్యతారహిత్యానికి మండిపడిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. కేరళ(Kerala)లోని వయనాడ్(Wayanad) లోని మనంతవాడి దగ్గరలో తమ కాఫీ తోటను (Coffee Estates) పరిశీలిస్తున్న రాధ అనే మహిళపై పులి దాడి చేసి చంపివేసింది. రాధ మంతనవాడి ఫారెస్ట్ వాచర్ భార్య. ఆయన స్వయంగా కాఫీ తోట వద్ద దింపి వెళ్ళిన కాసేపటికే ఈ దాడి జరిగింది. అయితే గత కొన్నేళ్లుగా పులుల సంచారంపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని.. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చూడనట్టు వ్యవహరించడంతో మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ మృతదేహంతో రహదారిపై భారీ ధర్నాకు దిగారు. కాగా పోలీసు ఉన్నతాధికారులు వారికి నచ్చజెప్పడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. మరోవైపు పులిని పట్టుకోవడానికి అటవీ అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కాగా మరణించిన రాధ.. భారత మహిళల జట్టులో ఆడుతున్న క్రికెటర్ మిన్ను మనికి దగ్గరి బంధువు కూడా.






