- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగం చేసి సంపాదించుకో..భరణం కోరిన భార్యకు సుప్రీంకోర్టు షాక్
విడాకుల సమయంలో భరణంగా గొంతెమ్మ కోరికలు కోరిన భార్యకు సుప్రీం ధర్మాసనం షాక్ ఇచ్చింది. అర్హత కలిగిన మహిళలు ఉద్యోగం చేసి సంపాదించాలని, భర్తల నుండి మధ్యంతర భరణం కోరకూడదని కీలక వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: విడాకుల సమయంలో భరణంగా గొంతెమ్మ కోరికలు కోరిన భార్యకు సుప్రీం ధర్మాసనం షాక్ ఇచ్చింది. అర్హత కలిగిన మహిళలు ఉద్యోగం చేసి సంపాదించాలని, భర్తల నుండి మధ్యంతర భరణం కోరకూడదని కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహమైన 18 నెలల్లోనే భర్త నుండి విడిపోయిన ముంబైకి చెందిన మహిళ విడాకులు తీసుకుంటూ తన భర్త నుండి రూ.12 కోట్లు డిమాండ్ చేసింది. అంతే కాకుండా బీఎండబ్ల్యూ కారును కూడా డిమాండ్ చేసింది. సదరు మహిళ ఐటీ ఉద్యోగి కావడంతో న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీరు ఐటీ ఉద్యోగి ఎంబీఏ చదువుకున్నారు. ప్రస్తుతం మీకు మంచి డిమాండ్ ఉంది. బెంగుళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎందుకు ఉద్యోగం చేయకూడదని ప్రశ్నించారు. మీకు వివాహం జరిగి 18 నెలలే అవుతుంది. 12 కోట్లతో పాటు బీఎండబ్ల్యూ కూడా కావాలా.. అని ప్రశ్నించారు. ఇంత చదువుకున్నారు, మీ కోసం మీరు సంపాదించుకోవాలని సూచించారు. జీవనభృతి అడకూడదని స్పష్టం చేశారు. దీంతో తన భర్త చాలా ధనవంతుడని అతడికి మానసిక వ్యాధి ఉందని కాబట్టి విడాకులు ఇవ్వాలని కోరారు. ఆమె వ్యాఖ్యలకు బెంచ్ సమాధానమిస్తూ.. మీరు ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకుంటే భరణంగా ఫ్లాట్ వస్తుంది లేదంటే ఏమీ రాదని స్పష్టం చేసింది.






