Parliament: డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

by Prasad Jukanti |

పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కీలక అప్ డేట్ వచ్చింది.

Parliament: డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) వచ్చే డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు (Kiran Rijiju) సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్లమెట్ శీతాకాల సమావేశాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఈ ఆమోదం ప్రకారం వింటర్ సెషన్ డిసెంబర్ 1 న మొదలై డిసెంబర్ 19 వరకు (పార్లమెంటరీ కార్యక్రమాల అవసరాల మేరకు) నిర్వహించబడుతాయని తెలిపారు. మన ప్రజాస్వామ్యాన్ని బలపరిచేలా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఈ సమావేశాలు నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా సాగాలని ఆశిస్తున్నట్లు కిరన్ రిజిజు ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను మోడీ సర్కార్ సభలో ప్రవేశపెట్టబోతోంది. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలి సారి ఈ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. అలాగే గత కొంత కాలంగా ఓట్ల చోరీ అంశంపై ఆరోపణలు చేస్తున్న లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల డోస్ పెంచారు. ఈ నేపథ్యంలో రాబోయే వింటర్ సెషన్ పార్లమెంట్ వేదికగా రాజకీయ వేడీ రాజేయబోతోందనే టాక్ వినిపిస్తోంది.

Next Story