- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
President Trump : లొంగిపోతారా? మరణిస్తారా? : ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను ధృవీకరిస్తూ, ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆ దేశాన్ని నాశనం చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‌పై అమెరికా యుద్దానికి సిద్దమైంది. ఆ దేశంలోని కీలక సైనిక, ప్రభుత్వ లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా భారీ వైమానిక దాడులకు దిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను ధృవీకరిస్తూ, ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆ దేశాన్ని నాశనం చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ పునర్నిర్మిస్తున్న అణు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ', ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రోర్ ఆఫ్ ది లయన్' పేర్లతో ఈ దాడులు చేపట్టినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది.
లొంగిపోతారా? మరణిస్తారా?
తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ట్రంప్ ఇరాన్ సైన్యానికి అల్టిమేటం జారీ చేశారు. ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్, సాయుధ దళాలు, పోలీసులకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే.. వెంటనే మీ ఆయుధాలను కింద పడేయండి. అలా చేస్తే మీకు పూర్తి రక్షణ (Immunity) కల్పిస్తాం. లేదంటే ఖచ్చితమైన మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి’ అని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ ప్రజలకు సందేశం..
ఇదే క్రమంలో ఇరాన్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న అక్కడి ప్రజలకు ట్రంప్ భరోసా ఇచ్చారు. ‘మీ స్వేచ్ఛా గడియారం దగ్గర్లోనే ఉంది. ప్రస్తుతం బయట బాంబుల వర్షం కురుస్తోంది, కాబట్టి ప్రజలెవరూ బయటకు రావొద్దు. మా దాడులు పూర్తయ్యాక, మీ ప్రభుత్వాన్ని మీరే ఏర్పాటు చేసుకోండి. ఆ అధికారం మీకే దక్కుతుంది.’ అని పేర్కొన్నారు.
దాడులకు కారణాలివే..
ఇరాన్ ఉగ్రవాదానికి అతిపెద్ద మద్దతుదారు అని, సొంత పౌరులనే వీధుల్లో చంపేస్తోందని ట్రంప్ మండిపడ్డారు. అణు ఆయుధాల తయారీకి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, అమెరికా ప్రజల రక్షణ కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అణు చర్చలు విఫలమవ్వడం, ఇరాన్ మొండి వైఖరి ప్రదర్శించడమే ఈ భారీ సైనిక చర్యకు దారితీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.






