టీవీకే గెలిచిన వేళ వైరల్ అవుతున్న పార్టీ మేనిఫెస్టో.. ఆ హామీలు నెరవేరేనా?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-05 12:49:04  IST  )

ప్ర‌మాణ‌స్వీకారం వ‌ర‌కు అంతా బాగానే ఉన్నా ఇప్పుడే ఉంది అస‌లు సినిమా. త‌మిళ‌నాడు 2025-2026 సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ దాదాపు 4.4 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంది. కానీ విజ‌య్ మేనిఫెస్టోలో పేర్కొన్న 336 హామీల‌ను అమ‌లు చేయాలంటే దాదాపు 12 ల‌క్ష‌ల కోట్లు కావాలి ఇది రాష్ట్ర బ‌డ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ‌.

టీవీకే గెలిచిన వేళ వైరల్ అవుతున్న పార్టీ మేనిఫెస్టో.. ఆ హామీలు నెరవేరేనా?
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు రాజకీయాల్లో మ‌రో స‌రికొత్త అధ్యాయం మొద‌లైంది. ద‌శాబ్దాలుగా పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌ను ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టి కొత్త‌గా వ‌చ్చిన విజ‌య్ టీవీకే పార్టీకి ప్ర‌జలు ప‌ట్టం క‌ట్టారు. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ 107 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా ప్ర‌స్తుతం పొత్తుల కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. విజ‌య్ తో క‌లిసి న‌డిచే ప‌దిమంది ఎమ్మెల్యేలు ఎవ‌రు అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 5స్థానాల్లో విజ‌యం సాధించ‌గా విజ‌య్ వారి మ‌ద్ద‌తు కోరుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌ద్ద‌తు కోసం రాహుల్ గాంధీతో మంతనాలు జ‌రిపిన‌ట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు ఈ నెల 7వ తేదీన విజ‌య్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్న‌ట్టు కూడా ప్రచారం జ‌రుగుతోంది. అయితే ప్ర‌మాణ‌స్వీకారం వ‌ర‌కు అంతా బాగానే ఉన్నా ఇప్పుడే ఉంది అస‌లు సినిమా. త‌మిళ‌నాడు 2025-2026 సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ దాదాపు 4.4 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంది. కానీ విజ‌య్ మేనిఫెస్టోలో పేర్కొన్న 336 హామీల‌ను అమ‌లు చేయాలంటే దాదాపు 12 ల‌క్ష‌ల కోట్లు కావాలి ఇది రాష్ట్ర బ‌డ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ‌. విజ‌య్ త‌న మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చూస్తే ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేరు. ప్ర‌తినెల మ‌హిళ‌ల ఖాతాల్లో రూ.2500 జ‌మచేస్తామ‌ని విజ‌య్ హామీ ఇచ్చాడు.

ప్ర‌తి కుటుంబానికి ఉచితంగా 200 మెగావాట్ల విద్యుత్, ఆరు గ్యాస్ సిలిండ‌ర్లు, ఆడపిల్ల‌ల పెళ్లికి 8గ్రాముల బంగారం మ‌రియు పెళ్లి చీర, ప్ర‌తిఒర్క‌రికి 25ల‌క్ష‌ల హెల్త్ ఇన్స్యూరెన్స్ అందిస్తామ‌ని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా నిరుద్యోగుల‌కు నెల‌కు 4వేల నిరుద్యోగభృతి, 5ల‌క్ష‌ల ఉద్యోగాలు, అర్హుల‌కు 25 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్స్ ఇస్తామ‌ని పేర్కొన్నాడు. వృద్ధుల‌కు 3వేల‌ పెన్ష‌న్ స‌హా ఇత‌ర హామీ ఇచ్చాడు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు 10 ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో ఉంది. దీంతో ఎలాంటి రాజకీయ‌, పాల‌న అనుభ‌వం లేని విజ‌య్ 4.4 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ తో 12 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చ‌య్యే హామీల‌ను ఎలా అమ‌లుచేస్త‌డ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

‘మీ సహకారం అవసరం’.. మోడీకి విజయ్ రిప్లై..

Next Story