- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Himanta Sarma: నా మాట తప్పని తేలితే రాజీనామా చేస్తా- గొగొయ్ పై హిమంత విమర్శలు
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గొగొయ్ కి పాకిస్థాన్ తో సంబంధాలున్నాయి హిమంత పదే పదే ఆరోపిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గొగొయ్ కి పాకిస్థాన్ తో సంబంధాలున్నాయి హిమంత పదే పదే ఆరోపిస్తున్నారు. కాగా.. మరోసారి గొగొయ్ పై హిమంత అవే వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పింది ఏదైనా తప్పు అని తేలితే రాజీనామా చేస్తానని అన్నారు. తను చెప్పిన ఒక్క మాట కూడా తప్పు అని నిరూపితమైతే ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా అని ఆయన అన్నారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) ఆహ్వానం మేరకు గొగొయ్ పాకిస్థాన్ వెళ్లారని, అక్కడ శిక్షణ పొందారని శర్మ ఆరోపించారు. తిరిగి వచ్చిన తర్వాత రఫేల్ కొనుగోలును ఆయన వ్యతిరేకించారని తెలిపారు. గొగొయ్ భార్యకు పాక్ సైన్యంతో సంబంధాలున్నాయని అన్నారు.
గొగొయ్ స్పందన
మరోవైపు, తనతోపాటు తన భార్యపై హిమంత పదే పదే చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తోసిపుచ్చారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని అన్నారు. ‘అసోం ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి నేను ఆందోళన చెందుతున్నా. ఆయన బాగా తెలిసిన వ్యక్తి. నేను అసోంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో నాపై నిఘా ఉంచారు. గత 13 ఏళ్లలో నా గురించి చాలా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో పాక్ తో సంబంధాలున్నాయని చేసిన వ్యాఖ్యలు పిచ్చితనం, అసంబద్ధతకు దారితీస్తాయి’ అని అన్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి హిమంత పదే పదే అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. 2026 తర్వాత ఆయనకు కొంత విశ్రాంతి లభించేలా చూస్తామని పరోక్షంగా అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.






