- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'సీబీఐ ఏమీ తేల్చలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?'
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు.

X
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని సీఎం అధికారిక బంగ్లా పునరుద్ధరణ పనులపై సీబీఐ విచారణకు ఆదేశించడంపై మండిపడ్డారు. ఒకవేళ ఈ దర్యాప్తులో సీబీఐకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకకుంటే రాజీనామా చేసేందుకు ప్రధాని మోడీ సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజనలో భాగంగా అయోధ్యకు బయలుదేరిన భక్తులతో గురువారం ఉదయం నిర్వహించిన ‘భజన సంధ్య’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 75,000 మంది వృద్ధులు తీర్థయాత్రలకు వెళ్లొచ్చారని, వీరిలో 4 వేల మంది అయోధ్యను సందర్శించారని చెప్పారు. ఈ స్కీమ్‌కు ఎంపికయ్యే యాత్రికులందరికీ ఎయిర్ కండిషన్డ్ రైలు ప్రయాణం, వసతి, భోజనం, బోర్డింగ్, బస ఏర్పాట్లతో సహా మొత్తం ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తోంది.
Next Story






