- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madhya Pradesh: మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై వేటు..!
కర్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు వేటు తప్పేలా లేదు

దిశ, నేషనల్ బ్యూరో: కర్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు వేటు తప్పేలా లేదు.ఆయన్ని ఇంకా పదవి నుంచి ఎందుకు తొలగించట్లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంలో మే 28న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. మంత్రిపై నమోదైన ఎఫ్ఐఆర్ దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన సిట్ ఆ రోజే నివేదిక ఇవ్వనుంది. దాన్ని బట్టే చర్యలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
విజయ్ షా ఏమన్నారంటే?
ఆపరేషన్ సిందూర్ పై బ్రీఫింగ్ చేసిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా (Madhya Pradesh minister Vijay Shah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆమెను విజయ్ షా ‘ఉగ్రవాదుల సోదరి’గా పేర్కొనడంపై దుమారం రేగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు.. ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.






