- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంజయ్ రౌత్‌కు బెదిరింపు సందేశాలు
థాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి.

న్యూఢిల్లీ: థాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. పంజాబ్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ సందేశాలు వచ్చాయని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్లు చెప్పారు. నా మొబైల్ ఫోన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చాను. అయితే ఈ ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.
గతంలోనూ ఇదే తరహా బెదిరింపులను ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. ఒకవేళ ఢిల్లీలో ఎదురైతే ఏకే-47తో చంపేస్తామని మెసేజ్ చేసినట్లు చెప్పారు. మూసేవాలాకు పట్టిన గతే తనకు పడుతుందని బెదిరించానని అన్నారు. సల్మాన్‌ను కూడా చంపేస్తామని సందేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. కాగా పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.






