Tejashwi : ఢిల్లీ ఎన్నికల తర్వాత అందరి దృష్టి బిహార్ పైనే..

by Shamantha N |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అందరి దృష్టి బిహార్ ఎలక్షన్స్ పైనే ఉంది. ఈ ఏడాదిలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Tejashwi : ఢిల్లీ ఎన్నికల తర్వాత అందరి దృష్టి బిహార్ పైనే..
X

దిశ,నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అందరి దృష్టి బిహార్ ఎలక్షన్స్ పైనే ఉంది. ఈ ఏడాదిలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడం.. బిహార్‌పై ప్రభావం చూపవచ్చా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ Tejashwi Yadav) సమాధానమిచ్చారు. ఢిల్లీలో బీజేపీ విజయం.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపదన్నారు. ‘బిహార్ అంటే బిహార్. దాన్ని అర్థం చేసుకోవాలి’ అని అన్నారు. "ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం (జనతా మాలిక్ హై). దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం బీజేపీ బాధ్యత. కేవలం వాగ్దానలతోనే సరిపెట్టరని ఆశిస్తున్నా" అని యాదవ్ అన్నారు.

బిహార్ ఎన్నికలపై

బిహార్‌లో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఆర్జేడీ పార్టీయే సీట్లు గెలుచుకుంది. అయితే, బిహార్ లో రాబోయే ఎన్నికలు అధికార సంకీర్ణ కూటమి గెలుస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా, ఈ అంచనాలన్నీ ఎన్డీఏకు ప్రయోజనం చేకూరుస్తాయని బీజేపీ, దాని మిత్ర పక్షాలు అంటున్నాయి. అయితే, దీని గురించే అఖిలేష్ యాదవ్ ను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ఇకపోతే, బిహార్‌లో ఎన్డీఏకు జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. 2005 నుండి బిహార్ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతున్నారు. మధ్యలో కొంతకాలం పాటు జితన్ రామ్ మాంఝీకి పగ్గాలు అప్పగించారు.

Next Story