- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pak MP: భారత్ యుద్ధానికి దిగితే ఇంగ్లాండ్ వెళ్లిపోతానన్న పాక్ ఎంపీ
రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే తాను ఇంగ్లాండ్‌కు పారిపోతానని చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెగల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భరత్ యుద్ధానికి దిగుతుందనే భయం పాక్ ప్రజల్లో నెలకొంది. ప్రజల్లోనే కాకుండా అక్కడి రాజకీయ నేతల్లోనూ ఇదే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వాధికారులు భారత్ యుద్ధానికి దిగితే అణ్వాయుధాలను వాడేందుకు కూడా సిద్ధమని పదే పదే చెబుతున్నారు. అయితే, వాస్తవంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్-ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్, రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే తాను ఇంగ్లాండ్‌కు పారిపోతానని చెప్పారు. విలేకరులతో మాట్లాడే సందర్భంలో యుద్ధం మొదలైతే మీరు కూడా ఆయుధాలను చేపడతారా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన అఫ్జల్ ఖాన్.. అలా జరిగితే తాను ఇంగ్లాండ్‌కు వెళ్లిపోతానన్నారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనక్కి తగ్గాలని మీరు భావిస్తున్నారా అని అడిగినప్పుడు, మనం చెప్పినంత మాత్రాన మోడీ వెనక్కి తగ్గుతారా? అంటూఉ అఫ్జల్ ఖాన్ వ్యంగ్యంగా చెప్పారు. పాక్ ఎంపీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే పాక్ రాజకీయ నేతలెవరూ తమ సొంత సైన్యాన్ని నమ్మట్లేదనే కథనాలను ఈ వీడియో నిజం చేస్తోంది.






