Wildfire: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 27 మంది మృతి

by B.Srinivas |

దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఆ దేశ ఆగ్నేయ ప్రాంతంలో సంభవించిన కార్చిచ్చు వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు.

Wildfire: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 27 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ కొరియా (South korea) లో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టించింది. ఆ దేశ ఆగ్నేయ ప్రాంతంలో సంభవించిన కార్చిచ్చు వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. సౌత్ కొరియా చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన ప్రమాదమని అంతర్గత, భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటన అనంతరం 37,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించింది. అనేక ప్రాంతాల్లో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కమ్యూనికేషన్ పూర్తిగా స్థంభించింది. ఇప్పటి వరకు35,000 హెక్టార్లకు పైగా అడవి కాలిపోయిందని భద్రతా విభాగం అధిపతి లీ హాన్-క్యుంగ్ తెలిపారు. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అకాశం ఉందని పేర్కొన్నారు. మంటలను అదుపు చేయడానికి తొమ్మిది వేల మందికి పైగా సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు.

దక్షిణ కొరియా చరిత్రలో సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఇదేనని అధికారులు భావిస్తున్నారు. 2000 ఏప్రిల్‌లో దేశ తూర్పు తీరంలో కార్చచ్చు ఏర్పడగా ఆ టైంలో 23,913 హెక్టార్ల అడవి దగ్ధమైంది. దాని తర్వాత ఇదే అతి పెద్దదని తెలుస్తోంది. ప్రస్తుత ప్రమాదంలో సాధారణ ప్రజలతో పాటు ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది సైతం మరణించారు. మంటలను ఆర్పడంలో నిమగ్నమై ఉన్న ఒక హెలికాప్టర్ కూడా కొండ ప్రాంతంలో ప్రమాదానికి గురికాగా ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ ప్రమాదానికి పొడివాతావరణం, తక్కువ వర్షపాతం నమోదవడమే నిపుణులు అధికారులు భావిస్తున్నారు. వాతావరణ మార్పు, నిరంతరం పెరుగుతున్న వేడి కారణంగానే కార్చిచ్చులు సంభవిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

Next Story