- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Incident : కారులో ప్రియుడితో భార్య..బానెట్ పై భర్త !
కారు(In Car)లో ప్రియుడు(With Boyfriend)తో కలిసి ఉన్న భార్య(Wife)ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే క్రమంలో ఓ వ్యక్తి(Husband)కారు బానెట్( Car Bonnet)ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వచ్చినా లెక్క చేయకుండా వారి ఆట కట్టించాడు.

దిశ, వెబ్ డెస్క్ : కారు(In Car)లో ప్రియుడు(With Boyfriend)తో కలిసి ఉన్న భార్య(Wife)ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే క్రమంలో ఓ వ్యక్తి(Husband)కారు బానెట్( Car Bonnet)ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వచ్చినా లెక్క చేయకుండా వారి ఆట కట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన(Viral Incident)ఉత్తర్ ప్రదేశ్(UP) మొరాదాబాద్ -ఆగ్రా హైవేపై చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 31 ఏళ్ల మొహద్ సమీర్ భార్య నూర్ అప్షా(29) టీచర్ గా పనిచేస్తోంది. తన మాజీ ప్రియుడైన టాక్సీ డ్రైవర్ నజుల్ హసన్ తో ఆమె తన బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. వారిద్దరిని ఎలాగైన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఎదురుచూస్తున్న సమీర్ ఓ రోజు రాత్రి తన భార్య, ఆమె ప్రియుడు హసన్ తో కలిసి కారులో వెలుతున్నారని గుర్తించి వారిని వెంబడించాడు. దీంతో వారు వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించగా వారి కారుకు సమీర్ తన బైక్ అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేశారు.
అయితే హసన్ తన కారుతో సమీర్ ను ఢీకొట్టి, కారుని వేగంగా ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో సమీర్ కారు బానెట్ పై పడిపోయినప్పటికి కారు ఆపకుండా అలాగే ఒక కిలోమీటర్ అతడిని ఈడ్చుకెళ్లారు. గంటకు 80-90 కి.మీ వేగంతో కారు ప్రయాణించినప్పటికీ, సమీర్ కింద పడిపోకుండా కారు బానెట్ ను గట్టిగా పట్టుకుని ప్రాణం దక్కించుకున్నాడు. అది చూసిన వారు మరో వాహనాన్ని కారుకు అడ్డుగా నిలిపి ఆ కారుని నిలిపేశారు.
ఆ వెంటనే స్థానికుల సహాయంతో సమీర్ తన భార్య, ఆమె ప్రియుడు హసన్ లను పట్టుకున్నాడు. ఈ ఘటనపై కట్ ఘర్ పోలీస్ స్టేషన్ లో సమీర్ ఫిర్యాదు చేశాడు. తనను కారుతో ఢీ కొట్టి చంపాలని చూశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






