భర్త ముందే ప్రియుడితో భార్య సెక్స్.. చేతులు, కాళ్లు కట్టేసి టార్చర్.. భరించలేక..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లోని కాకోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వైరా బాద్షాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఆసిఫ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

భర్త ముందే ప్రియుడితో భార్య సెక్స్..  చేతులు, కాళ్లు కట్టేసి టార్చర్.. భరించలేక..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లోని కాకోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వైరా బాద్షాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఆసిఫ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతని భార్యకు గ్రామానికి చెందిన సలీమ్‌తో అక్రమ సంబంధం ఉందని.. అలాగే మానసిక, శారీరక హింసలు అతడు సూసైడ్ చేసుకునేందుకు కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. సలీమ్ ఆసిఫ్ భార్యకు మత్తు మాత్రలు ఇచ్చేవాడు. ఆమె వాటిని తన భర్తకు ఇచ్చి.. అతని ముందే సలీమ్‌తో లైంగిక చర్యల్లో పాల్గొనేది. కొన్నిసార్లు ఆసిఫ్ చేతులు, కాళ్లు కూడా కట్టేసేది.

ఈ విషయాన్ని తన మరణానికి నాలుగు రోజుల ముందు తన సోదరుడికి చెప్పాడు అసిఫ్. అమానవీయ ప్రవర్తన, మానసిక హింసలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు ఆసిఫ్ భార్య, సలీమ్‌తోపాటు మరో వ్యక్తి షారుఖ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపాడు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ).

Next Story