- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త కిడ్నీ అమ్మేసి.. లవర్‌తో పరార్.. ఏం మోటివేషన్‌రా బాబోయ్..!
ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయని, ఆడ పిల్లల చదువులు, పెళ్లిళ్లకూ సేవింగ్స్ లేవని ఆ భర్య తన భర్తతో ట్రిక్ ప్లే చేసింది. తీరా కిడ్నీ అమ్మేశాక షాక్ ఇచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయని, ఆడ పిల్లల చదువులు, పెళ్లిళ్లకూ సేవింగ్స్ లేవని ఆ భర్య తన భర్తతో ట్రిక్ ప్లే చేసింది. భర్త కిడ్నీ అమ్మేస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని మోటివేట్ చేసింది. భార్య మాటలు నమ్మి కిడ్నీ కొనుగోలుదారుల కోసం ఏడాది కాలం వెతకగా మూడు నెలల క్రితం బయ్యర్లు దొరికారు. కిడ్నీ అమ్మేశాక, రూ. 10 లక్షల డబ్బులు చేతికి వచ్చాక భార్య అసలు ప్లాన్ బయటపడింది. రూ. 10 లక్షలు తీసుకుని ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ పెయింటర్‌తో చెక్కేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఖంగుతిన్న భర్త అనివార్యంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
పోలీసు సహాయంతో తన భార్యను ట్రాక్ చేసి పట్టుకున్నాడు. ఒక రోజు అతని తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి లవర్‌తో తన భార్య ఉంటున్న ఇంటికి వెళ్లారు. దయచేసి తమతో మాట్లాడాలని అందరూ విజ్ఞప్తి చేసినా కనీసం తలుపు కూడా తెరవలేదు. ఏం చేసుకుంటావో చేసుకోమని భర్తను బెదిరించడమే కాదు.. విడాకులకు దరఖాస్తు చేస్తానని హెచ్చరించింది. తనకు అన్యాయం జరిగిందని, ఆదుకోవాలని సదరు బాధితుడు పోలీసుల ఎదుట బోరున విలపించాడు.






