- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News : భర్తను 36 సార్లు పొడిచి చంపిన భార్య.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
మధ్యప్రదేశ్(MP)లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్(MP) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్తను బీర్ బాటిల్ తో 36 సార్లు పొడిచి హత్య చేసింది(Husband Murderd). ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో రాహుల్ (25) అనే వ్యక్తి ఇటీవలే వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆమె వేరే వ్యక్తిని ప్రేమించగా.. ఇంట్లోవాళ్లు బలవంతంగా రాహుల్ కి ఇచ్చి కట్టబెట్టారు. ఎలాగైనా తన ప్రియుడు యువరాజ్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువతి.. విషయాన్ని ప్రియునికి చెప్పింది. కొంతమంది స్నేహితుల సహాయంతో రాహుల్ ను చంపాలని ప్లాన్ వేసుకొని.. ముందుగా షాపింగ్ కు వెళ్దామని బయటికి తీసుకు వెళ్ళింది. వారిని వెంబడించిన యువరాజ్ స్నేహితులు.. ఓ చోట వారిని ఆపి చెట్ల పొదల్లోకి లాక్కుపోయారు.
భార్య అక్కడే పడి ఉన్న బీర్ బాటిల్ తో భర్తను విచక్షణా రహితంగా పొడవడంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. అయితే భర్తను చంపేశాక తీరిగ్గా ప్రియునికి ఫోన్ చేసి 'పని అయిపోయింది' అంటూ వీడియో కాల్ చేసి చూపించింది. డెడ్ బాడీ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టగా.. ఈ మొత్తం వ్యవహారం అంతా బయటికి వచ్చింది. ఈ హత్యలో భాగం అయిన వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ యువతి మైనర్ కావడం గమనార్హం.






