- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఘోరం.. పెరుగులో పాయిజన్ కలిపినా చావలేదని.. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..
ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. 150 రూపాయల పాయిజన్ బాటిల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భార్య.. మొదటి సారి పెరుగులో కలిపి భర్తకు తినిపించింది. ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అంతా సెట్ అయ్యాక ఇంటికి పంపించారు వైద్యులు

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. 150 రూపాయల పాయిజన్ బాటిల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భార్య.. మొదటి సారి పెరుగులో కలిపి భర్తకు తినిపించింది. ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అంతా సెట్ అయ్యాక ఇంటికి పంపించారు వైద్యులు. కానీ మరుసటి రోజు భార్య మళ్లీ కిచిడిలో విషం కలిపి తినిపించింది. దీంతో అతను మరణించాడు. అయితే ఇంతకు ముందే ఆయన ఆస్పత్రిపాలు కాగా కొన్నాళ్లుగా అనారోగ్యం బాగాలేకనే మరణించాడని, సహజ మరణమేనని అనుకున్నారు కుటుంబీకులు, బంధువులు. అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఎలాంటి డౌట్ రాకున్నా.. ఆ తర్వాత కోడలిపై అత్తకు అనుమానం పెరిగింది. కారణం పక్కింటి వ్యక్తి పదే పదే వచ్చి గంటల తరబడి కూర్చోవడం... తన కోడలి ముఖంలో కనీసం విషాద ఛాయలు లేకపోవడం. దీంతో అత్త పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఇంట్లో తనిఖీలు చేయగా.. కోడలు గదిలో పాయిజన్ బాటిల్ గుర్తించారు. వాట్సాప్ చాట్ చూస్తే పొరుగింటి వ్యక్తితో ఎఫైర్ ఉన్నట్లు తేలింది. దీంతో భర్తను హత్య చేసింది భార్య శశి, ప్రియుడు యాదవేంద్ర అని గుర్తించిన పోలీసులు.. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.






