భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన మహిళ.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

మహారాష్ట్రలోని నల సోపారాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 34 ఏళ్ల విజయ్ చౌహాన్ అనే వ్యక్తి మృతదేహం అతని సొంత ఇంట్లోనే పాతిపెట్టినట్లు గుర్తించబడింది.

భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన మహిళ.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని నల సోపారాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 34 ఏళ్ల విజయ్ చౌహాన్ అనే వ్యక్తి మృతదేహం అతని సొంత ఇంట్లోనే పాతిపెట్టినట్లు గుర్తించబడింది.ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఇంట్లో టైల్స్ కింద సమాధి చేసి.. మళ్లీ అమర్చింది. విజయ్ దాదాపు మూడు వారాలుగా కనిపించకుండా పోయాడు. ఆసక్తికరంగా.. విజయ్ భార్య చమన్ దేవి, పొరుగింటి మోను విశ్వకర్మ కూడా అదే సమయంలో అదృశ్యమయ్యారు.

ఈ టైంలో విజయ్ తమ్ముడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో ఒక కారణం చెప్పి దాటేసింది చమన్ దేవి. దీంతో అనుమానం వచ్చిన ఆయన.. ఇంటికి వచ్చి చెక్ చేయగా తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి స్మెల్ వచ్చినట్లు అనిపించడంతో పోలీసులకు ఫోన్ చేశాడు. తలుపు తీసి చూడగా.. ఎలాంటి తేడా కనిపించలేదు. కానీ ఓ చోట టైల్స్ కొత్తగా ఉండటంతో తవ్వి చూడగా.. మర్డర్ సీక్రెట్ బయటపడింది. ఆరు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో తవ్విపెట్టారు.

హత్య తర్వాత.. చమన్, మోను పరారీ అయ్యారు. చమన్ విజయ్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.8 లక్షలకు పైగా డబ్బు డ్రా చేయబడింది. పోలీసులు వీరిని జూలై 22న పూణేలో అదుపులోకి తీసుకున్నారు. శవం కుళ్ళిపోవడంతో గుర్తింపు కష్టంగా ఉండటంతో.. విజయ్ సోదరుడి రక్త నమూనాతో డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story