- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య రీల్స్ పిచ్చి.. లైక్‌ల కోసం హత్య, ఆత్మహత్యకు తెగింపు.. కాపాడాలంటూ పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు భర్త
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య రీల్స్ పిచ్చితో మా జీవితం అతలాకుతలం అయ్యేలా ఉందంటూ పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు భర్త. మమ్మల్ని ఎలాగైనా కాపాడాలంటూ పోలీస్ కమిషనర్ ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య రీల్స్ పిచ్చితో మా జీవితం అతలాకుతలం అయ్యేలా ఉందంటూ పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు భర్త. మమ్మల్ని ఎలాగైనా కాపాడాలంటూ పోలీస్ కమిషనర్ ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. బాధితుడు షా నవాజ్.. భార్యపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ గురించి పోలీసులకు చెప్పుకొచ్చాడు. లైక్స్, ఫాలోవర్స్ వేటలో పడి తన భార్య పురుషులతో అసభ్యకరంగా రీల్స్ చేస్తోందని.. ఈ క్రమంలో తమ మధ్య తరుచూ వాగ్వాదం జరుగుతోందని చెప్పాడు. అయితే ఈ గొడవను కూడా రికార్డ్ చేసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తుందన్నాడు షా.
అంతేకాదు కొన్నిసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు నటిస్తూ.. కరెంట్ తీగ పట్టుకోవడం, పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని బెదిరించడం వంటివి చేసిందని.. వీటిని కూడా రీల్స్ చేసి అప్‌లోడ్ చేసిందన్నాడు. ఇప్పటి వరకు ఓకే కానీ కొద్ది రోజుల క్రితం తనపై కత్తితో దాడి చేసిందని.. దీంతో తన ప్రాణానికి ఆపాయం ఉందని తెలుసుకుని.. రక్షణ కోసం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను కమిషనర్‌కు చూపించిన బాధితుడు.. తనకు, తన పిల్లలకు ప్రాణాపాయం ఉందని.. ఇలాంటిదేదో జరిగే ముందే చర్యలు తీసుకోవాలని కోరాడు.






