- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడేళ్ల కొడుకుని వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. కారులోనే పెళ్లి
ఏడేళ్ల కుమారుడ్ని, భర్తను వదిలి ప్రియుడి కోసం వెళ్లిన ఓ భార్య కారులో పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాను రాను మానవ సంబంధాల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. పరాయి ప్రేమ కోసం కట్టుకున్న వాడిని, కన్న బిడ్డలను కాదనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనే కర్ణాటలో చోటు చేసుకుంది. ఏడేళ్ల కొడుకుని, భర్తను కాదని ఓ భార్య తన ప్రియుడి వద్దకు పారిపోయింది. అంతటితో ఆగకుండా కారులోనే తన ప్రియుడి చేత తాళి కట్టించుకుని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. హాసన్ జిల్లా అరకల్గూడ్ తాలూకాలోని ముండగోడు గ్రామానికి చెందిన హర్షితకు ముకందూర్ గ్రామానికి చెందిన తన బావ ప్రకాష్‌తో 2017లో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే తన ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి మార్చి 30న ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ప్రియుడి వద్దకు.. కారులో పెళ్లి:
ఇంటి నుంచి వెళ్లిన హర్షిత తన ప్రియుడు సచిన్ వద్దకు వెళ్లింది. అక్కడ ఓ కారులో హర్షిత మెడలో సచిన్ తాళి కట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. అయితే ఇంటి నుంచి వెళ్లి ఎంతకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు హర్షిత కనిపించడం లేదని హాసన రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షిత ఆచూకీ కనుగొని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ సమయంలో తన భర్త ప్రకాష్‌తో వెళ్లనని తన ప్రియుడు సచిన్‌తో వెళ్తానని హర్షిణి పట్టుబట్టింది. దీంతో చేసేదేమి లేక ఆమెను పోలీసులు ప్రభుత్వ మహిళా సాంత్వన కేంద్రానికి తరలించి కేసు విచారణ ప్రారంభించారు. హర్షిణి వ్యవహారం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కట్టుకున్న భర్తను, కన్న బిడ్డను వదిలేసి కొత్త సుఖాల కోసం ఇలా చేయడం ఏంటని నిలదీస్తున్నారు.






