Plane Crash : భార్య చివరి కోరిక తీర్చడానికి ఇండియా వచ్చి.. విమాన ప్రమాదంలో అనంత లోకాలకు

by Muthe.Rajitha |

అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే.

Plane Crash : భార్య చివరి కోరిక తీర్చడానికి ఇండియా వచ్చి.. విమాన ప్రమాదంలో అనంత లోకాలకు
X

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఎయిర్ ఇండియా బోయింగ్(Air India Boeing) విమానం కుప్పకూలి, విమానంలోని 241 మంది ప్రయాణికులు మృతి చెందారు. విమాన ప్రమాదం వందలాది కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. కాగా మృతుల్లో ఒక్కొక్కరి గాథలు మెల్లగా బయట పడుతున్నాయి. ఈ ప్రమాదంలో మరణించిన లండన్ వాసి అర్జున్ భాయ్ భార్య చివరి కోరిక తీర్చడానికి ఇండియా వచ్చి, చివరికి తాను కూడా భార్య చేరిన పైలోకాలకు వెళ్ళిపోయాడు.

అర్జున్ వివరాల్లోకి వెళితే.. యుక్త వయస్సులోనే భార్య అనారోగ్యంతో చనిపోయింది.. ఆమె చివరగా భర్తను ఒక కోరిక కోరింది. తాను మరణించిన తర్వాత తన అస్థికలు పూల కలశాన్ని తాను పుట్టి పెరిగిన గ్రామంలో ఉన్న చెరువు, సమీపంలో ఉన్న నదిలో కలపమని కోరింది. భార్య చివరి కోరికను నెరవేర్చడానికి లండన్ నుండి గుజరాత్ వచ్చిన అర్జున్ భాయ్ తన భార్య కోరినట్లుగా అమ్రేలీ జిల్లా పరిధిలో ఉన్న ఆమె స్వగ్రామానికి వెళ్ళి కొన్ని అస్థికలు అందులో నిమజ్జనం చేశాడు. మిగిలిన అస్థికలు పూల కలశంతో పాటు పూల్ నదిలో నిమజ్జనం చేసి భార్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాడు.

ఈ క్రమంలో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో అతను మృత్యువాత పడి, తాను కూడా భార్య చెంతకు వెళ్ళిపోయాడు. భార్య భర్తలను పదిరోజులలోపే మృత్యువు కబళించడం రెండు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి ఇద్దరి పిల్లలు ఒంటరివారయ్యారు.

Next Story