- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివలింగాన్ని తాకేందుకు లారెన్ పావెల్ జాబ్స్‌కు అనుమతి నిరాకరణ
అయితే కాశీ విశ్వనాథుని ఆలయంలో ఉన్న పద్దతులు, ఆచారాల మేరకు హిందువేతరులు శివలించాన్ని తాకే అర్హత ఉండదు.

- కుంభమేళాకు వచ్చిన స్టీవ్ జాబ్స్ భార్య
- కాశీ విశ్వనాథుని ఆలయంలో పూజలు
దిశ, నేషనల్ బ్యూరో:
ఆపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్‌ను కాశీ విశ్వనాథుని ఆలయంలోని శివలింగాన్ని ముట్టుకోవడానికి పూజారులు అనుమతించలేదు. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహాకుంభమేళాలో పాల్గొనడానికి ఇండియాకు వచ్చిన లారెన్ పావెల్.. ప్రయాగ్‌రాజ్‌లోని నిరంజినీ అఖారాకు చెందిన ఆచార్య మహా మండలేశ్వర్ స్వామీ కైలాసానంద గిరి ఆశ్రమానికి చేరుకున్నారు. లారెన్‌కు సనాతన ధర్మం పట్ల లోతైన ఆసక్తి ఉందని, అందుకే తన గురువు గోత్రమైన అచ్యుతను ఆమెకు అందించినట్లు స్వామీ కైలాసానంద తెలిపారు. పావెల్‌కు కమల అని కొత్త పేరు పెట్టినట్లు కూడా చెప్పారు. అయితే కాశీ విశ్వనాథుని ఆలయంలో ఉన్న పద్దతులు, ఆచారాల మేరకు హిందువేతరులు శివలించాన్ని తాకే అర్హత ఉండదు. అందుకే ఆమెను అనుమతించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆమె ఆలయంలో నిర్వహించిన అభిషేకంలో పాల్గొని పూజలు చేశారని చెప్పారు. శివలింగాన్ని తాకనివ్వకపోవడంపై ఎలాంటి వివాదానికి తావులేదని, ఆలయంలో కేవలం ఆచారాలు మాత్రమే పాటించామని స్వామి కైలాసానంద చెప్పారు. అయితే ఈ నెల 15 వరకు ఆమె ఇక్కడే ఉంటారని.. పవిత్ర గంగానదిలో స్నానం కూడా చేస్తారని తెలిపారు.






