- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Supreme Court: సివిల్ వివాదాలపై కేసు.. యూపీ పోలీసుల తీరుపై సుప్రీం ఆగ్రహం

దిశ, నేషనల్ బ్యూరో: సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు (Supreme Court) రూ.50,000 జరిమానా విధించింది. సివిల్ వివాదాలలో ఎఫ్ఐఆర్ నమోదును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయని ఉన్నతన్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇది నిబంధనలు ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తి వివాదంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం కరెక్ట్ కాదని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. జరిమానాను మాఫీ చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా..అందుకు నిరాకరించింది. గతంలో ఓ కేసు విషయంలో ఇలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ పోలీసులు తమ వైఖరి మార్చుకోవట్లేదని మండపడింది. ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని యూపీ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది.
ఆస్తి వివాదం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిరానీ కుటుంబం కాన్పూర్‌లోని తమ భవనాన్ని శిల్పి గుప్తా అనే వ్యక్తికి రూ.1.35 కోట్లకు విక్రయించడానికి మౌఖికంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 25శాతం అడ్వాన్స్ కాకుండా గుప్తా కేవలం రూ.19 లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో వారు మరో వ్యక్తికి తమ బిల్డింగ్ ని రూ.90లక్షలకు విక్రయించారు. అయితే తాను చెల్లించిన రూ.19లక్షలు తిరిగి ఇవ్వాలని కోరగా బిరానీలు స్పందించకపోవడంతో బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బిరానీలపై మోసం, బెదిరింపు వంటి క్రిమినల్ నేరాలను నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు అలహాబాద్ కోర్టును ఆశ్రయించగా దర్యాప్తుకు నిరాకరించడంతో బాధితుడు సుప్రీంను ఆశ్రయించాడు. బిరానీ సోదరులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శిల్పి గుప్తా దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను స్థానిక మెజిస్టీరియల్ కోర్టు రెండుసార్లు తిరస్కరించినప్పటికీ..రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. దీనిపైనే కోర్టు మండిపడింది.