- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకెందుకు పశ్చాత్తాపం?.. భార్యను తగలబెట్టేసిన భర్త షాకింగ్ కామెంట్స్
యూపీలో కట్నం కోసం భార్యను తగలబెట్టేసిన భర్త షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమెను తాను చంపలేదని, తనకు పశ్చాత్తాపం ఎందుకుంటుందని అడిగాడు.

దిశ, నేషనల్ బ్యూరో: వరకట్నం కోసం వేధించి, నిక్కి అనే యువతిని అత్యంత దారుణంగా చంపిన యూపీ కుర్రాడు విపిన్ భాటీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కట్నం కోసం విపిన్, అతని తల్లి దయా కలిసి నిక్కికి నిప్పంటించారని ఆమె సోదరి కాంచన్ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవడంతో విపిన్2ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తన కుమార్తెను చంపిన అత్తింటివారిపై నిక్కి తండ్రి భికారీ సింగ్ మండిపడ్డారు. ‘వాళ్లు హంతకులు. అలాంటి వాళ్లను కాల్చి చంపాలి. పార్లర్ నడుపుతూ కొడుకును పోషించుకుంటోంది నా కూతురు. అలాంటి అమ్మాయిని ఆ కుటుంబం అంతా కలిసి చిత్రహింసలు పెట్టి చంపేశారు’ అని వాపోయారు.
ఇది జరిగిన కాసేపటికే విపిన్ ఇంటికి పోలీసులు వెళ్లారు. నిక్కిపై పెట్రోల్ పోసిన బాటిల్‌ను గుర్తించేందుకు విపిన్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు అతను ప్రయత్నించడంతో విపిన్ కాలిలో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన విపిన్.. తనేమీ పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదనడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ‘నేను తనను చంపలేదు. తనంతట తానే చనిపోయింది. భార్యాభర్తలన్నాక గొడవలు సహజమే’ అని చాలా తేలికగా ఈ ఘటనను కొట్టిపారేశాడు.
విపిన్, రోహిత్ ఇద్దరు సోదరులను నిక్కి, కాంచన్ అక్కచెల్లెళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం పరిస్థితి ఏమాత్రం బాగోదని, కుటుంబం గురించి ఇద్దరు సోదరులు అసలు పట్టించుకోరని కాంచన్ ఆరోపించింది. అన్నదమ్ములిద్దరూ అర్ధరాత్రి వరకు ఇంటికి రారని, కనీసం కాల్ చేసినా సమాధానం ఉండదని, ఏమైందని ప్రశ్నిస్తే గొడవ పడతారని ఆమె తెలిపింది. అత్త దయా, విపిన్ కలిసే నిక్కిని చంపేశారని ఆరోపించింది.






