Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి...ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు..? దీని వెనుకున్న కథ ఏంటి..?

by Vennela |   (  Updated:2025-05-07 03:16:17  IST  )

Operation Sindoor: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట క్షిపణులతో దాడి చేసింది.

Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి...ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు..? దీని వెనుకున్న కథ ఏంటి..?
X

దిశ, వెబ్ డెస్క్: Operation Sindoor: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆపరేషన్ కు సింధూర అనే పేరు ఎందుకు పెట్టారు అనే సందేహం చాలామందికి కలగవచ్చు. అందుకు గల కారణాలు ఎంత ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సింధూర్ అంటే ఏమిటి?

పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది హతమయ్యారు. వీరిలో ఎంతోమంది మహిళల నుదుటన సింధూరం దూరమైంది. అందుకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టినట్లు సమాచారం అందుతోంది. బాధిత మహిళల భర్తలను హతమార్చి వారి నుదుటన సింధూరం దూరం చేసినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. అందుకే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

నిజానికి తెలుగులో సింధూర్ అంటే స్త్రీలు నుదుటి పై భాగంలో పెట్టుకునే కుంకుమ లేదా తిలకం. ఇది స్త్రీల గౌరవం, భద్రత, సంప్రదాయం, మాంగళ్యానికి చిహ్నంగా భావిస్తారు. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టడం వెనుక ఉన్న భావం కూడా అదే. దీని భావం ఏమిటంటే..దేశమాతను రక్షించడానికి ఆమె నుదిటిపై ఉన్న తిలకం (సింధూర్) కాపాడేందుకు భారత భూభాగాన్ని ఉగ్రవాదుల దాడుల నుండి రక్షించడమే కాకుండా తిరిగి జవాబు ఇవ్వడమే లక్ష్యంగా భావించి ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టారు.

ఆపరేషన్ సింధూర్ అనేది భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకొని సాగించిన క్షిపణి దాడుల సమాహారం. ఈ దాడుల్లో పాకిస్థాన్ లోని బాలాకోట్– పాక్ ఆక్రమిత కాశ్మీర్, ముజఫరాబాద్ – పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని, చకోతి – నియంత్రణ రేఖ (LoC) సమీప గ్రామం, , కోట్లీ – పాక్ ఆక్రమిత కాశ్మీర్, నీలం లోయ – పాక్ ఆక్రమిత కాశ్మీర్, మాన్సెహ్రా – ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, పాకిస్తాన్, బహావల్‌పూర్ – పాకిస్తాన్ ప్రాంతాలపై క్షిపణులతో విరచుకుపడింది.

ఈ ఆపరేషన్ సింధూర్ మిషన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా వార్ రూమ్ లో కూర్చొని పర్యవేక్షించినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఈ దాడిపై అటు ప్రపంచ దేశాల నుంచి కూడా స్పందన లభిస్తుంది. అమెరికా తాజాగా స్పందిస్తూ ఇరుదేశాలు సామరస్య పూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచన చేసింది.

Next Story