Viral video : రోడ్డుపై పులి వెళ్తుంటే కేకలేంటి? ఐఎఫ్ఎస్ అధికారి హెచ్చరిక

by Ramesh Naini |

అడవి జంతువుల సహజ ఆవాసాల్లోకి వెళ్లినప్పుడు ప్రజలు ఎలా ప్రవర్తించారో తెలియజేసే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral video : రోడ్డుపై పులి వెళ్తుంటే కేకలేంటి? ఐఎఫ్ఎస్ అధికారి హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: అడవి జంతువుల సహజ ఆవాసాల్లోకి వెళ్లినప్పుడు ప్రజలు ఎలా ప్రవర్తించారో తెలియజేసే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పులి రోడ్డు దాటుతుండగా, అక్కడ ఉన్న ప్రజలు కేకలు వేస్తూ గందరగోళం సృష్టించడం ఓ వీడియోలో కనిపిస్తుంది. దీనిపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కశ్వాన్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అది దాడి చేసే ప్రమాదం ఉంది!

వైరల్ అవుతున్న వీడియోలో పులి చాలా ప్రశాంతంగా రోడ్డు దాటుతున్నప్పటికీ, చుట్టుపక్కల ఉన్న జనం కేకలు వేస్తూ దానిని భయపెట్టే ప్రయత్నం చేశారు. దీనిపై పర్వీన్ కాశ్వాన్ స్పందిస్తూ.. ‘ఆ పులి చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ప్రజలు సృష్టిస్తున్న గందరగోళాన్ని ఒకసారి చూడండి. ఇలాంటి భయాందోళనలు పులిని రక్షణాత్మక దాడి (Defensive Attack)కి ప్రేరేపిస్తాయి. మనుషుల ప్రవర్తన వల్ల అది ఒక్కసారిగా విరుచుకుపడే ప్రమాదం ఉంది’ అని హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు లేదా అటవీ ప్రాంతాల్లో ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘వన్యప్రాణి జోన్లలో జంతువులకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వాటికి తగినంత ఖాళీ ప్రదేశాన్ని వదిలేయండి, వాటిని ఇబ్బంది పెట్టకండి’ అని ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

Next Story