ఇరాన్‌పై ఇప్పుడే యుద్ధం ఎందుకు..? ట్రంప్ ప్లాన్ ఏంటి?

by Phanindra |

ఇరాన్‌పై ఇప్పుడే యుద్ధం ఎందుకు మొదలుపెట్టారు? ట్రంప్ ప్లాన్ ఏంటి? ఇదే అదనుగా భావించారా..?

ఇరాన్‌పై ఇప్పుడే యుద్ధం ఎందుకు..? ట్రంప్ ప్లాన్ ఏంటి?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆత్మరక్షణ కోసమే ఇరాన్‌పై దాడులు చేస్తున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి. అయితే ఇరాన్ మిలిటరీ బలాన్ని యూఎస్, ఇజ్రాయెల్‌తో పోలిస్తే అది పోటీనే కాదు. అలాంటప్పుడు ఇది ఆత్మరక్షణ ఎలా అవుతుందనేది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇరాన్ మొత్తం ప్రపంచానికే ముప్పు అని తన వీడియో సందేశంలో ప్రకటించడం గమనార్హం. కానీ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఇజ్రాయెల్, యూఎస్ రెండు దేశాలూ కూడా ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇదే సరైన అవకాశంగా భావించాయని అర్థమవుతుంది. గతేడాది ఇజ్రాయెల్, యూఎస్ కలిసి దాడులు చేయడంతో ఇరాన్ మిలిటరీ వ్యవస్థ, రక్షణ బలహీనపడ్డాయి. వాటిని పునరుద్ధరించుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానికితోడు ఈ ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో అంతర్గతంగా కూడా ప్రజలపై ఇరాన్ ప్రభుత్వం పట్టుసడలింది. ఇలా అన్నిరకాలుగా బలహీనపడిన ఇరాన్‌ను దెబ్బకొట్టాలంటే ఇదే సరైన సమయమని ఇజ్రాయెల్, యూఎస్ నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

Next Story