- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Stampede : ఎక్స్ట్రా టికెట్స్ ఎందుకు అమ్మారు? : హైకోర్ట్ ఆగ్రహం
ఢిల్లీ రైల్వే స్టేషన్(Delhi Railway Station)లో తొక్కిసలాట(Delhi Stampede) జరిగి 18 మంది మృతిచెందగా.. మరో 30 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ రైల్వే స్టేషన్(Delhi Railway Station)లో తొక్కిసలాట(Delhi Stampede) జరిగి 18 మంది మృతిచెందగా.. మరో 30 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉండగా.. మరణించిన 18మంది పేర్లను అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్ట్(Delhi High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ తొక్కిసలాటపై విచారణ చేపట్టిన కోర్ట్.. ఎక్స్ట్రా టికెట్లు ఎందుకు అమ్ముతున్నారని మండిపడింది. కోచ్ లో పట్టే ప్రయాణీకుల కంటే ఎక్కువ టికెట్లు అమ్మడంపై ఫైర్ అయింది.
మీకు ఆదాయం రావాలని మాత్రమే చూస్తున్నారని, అన్ని వేల మంది ప్రయాణికులు ఒకటీ రెండు రైళ్లల్లో ఎలా ప్రయాణించగలరో ఎందుకు ఆలోచించలేక పోయారు అని రైల్వేశాఖను నిలదీసింది. రైల్వే కోచ్ లలో ప్రయాణీకుల పరిమితిపై, అనుమతి లేకుండా వివిధ కోచ్ లలో ప్రయాణించే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ.. రైల్వే అధికారులను, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాగా ఉత్తరప్రదేశ్(UP) లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbhmela)కు వెళ్లేందుకు 10 వేల మంది ప్రయాణికులు రావొచ్చునని అంచనా వేసిన రైల్వే.. లక్ష మంది ప్రయాణికులు స్టేషన్ కు చేరుకోవడంతో చేతులు ఎత్తేసింది. దీంతో భారీగా ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు.






