- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్సీబీకి మళ్లీ కోహ్లీ కెప్టెన్ అవుతాడా?
గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీకే మరోసారి బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్సీబీ సీవోవో రాజేశ్ మీనన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

- 2025 సీజన్‌లో నాయకుడు ఎవరు?
- స్పష్టం చేసిన రాజేశ్ మీనన్
దిశ, స్పోర్ట్స్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఐపీఎల్ - 2025 సీజన్‌లో నడిపంచేది ఎవరనే విషయంపై అంతటా ఆసక్తి నెలకొంది. 2022 నుంచి 2024 వరకు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ తిరిగి కొనుగోలు చేయలేదు. గతేడాది జరిగిన వేలం పాటలో ఢిల్లీ కాపిటల్స్ జట్టు డుప్లెసిస్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఆర్సీబీకి ఈ సీజన్‌లో ఎవరు కెప్టెన్‌గా ఉంటారనే విషయంపై చర్చ జరుగుతోంది. గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీకే మరోసారి బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్సీబీ సీవోవో రాజేశ్ మీనన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'జట్టు కెప్టెన్ ఎవరనే విషయంపై మేమింగా నిర్ణయం తీసుకోలేదు. జట్టులో నలుగురైదుగురు ఆటగాళ్లకు నాయకత్వం వహించే టాలెంట్ ఉంది. అయితే ఇంత వరకు కెప్టెన్ ఎవరనే విషయంపై మేనేజ్‌మెంట్ చర్చించుకోలేదు. త్వరలోనే ఈ విషయంలో లోతైన చర్చ చేసి నిర్ణయం తీసుకుంటాము' అని రాజేశ్ మీనన్ తెలిపారు. కాగా, 2011 నుంచి 2023 మధ్యలో ఆర్సీబీకి 143 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ.. 66 విజయాలు, 70 ఓటములు నమోదు చేశాడు. మూడు మ్యాచ్‌లు టైగా ముగియగా, నాలుగు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. 2016 సీజన్‌లో ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చాడు. ఆ సీజన్‌లో అద్బుతంగా రాణించిన కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశాడు. అయితే ఆర్సీబీ ఇంత వరకు ఐపీఎల్ చాంపియన్‌గా నిలవలేదు.






