కర్నాటక సీఎం ఎవరో ఇంకా ఖన్ఫామ్ కాలే: సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కర్నాటక సీఎం ఎవరో ఇంకా ఖన్ఫామ్ కాలే: సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక తదుపరి సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పేరు ఖన్ఫామ్ అయినట్లు వార్తలు వినిపిస్తోన్న వేళ కర్నాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటక సీఎం ఎంపికపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధిస్తున్నామన్నారు. కర్నాటక సీఎం పేరు ఖరారు అయినట్లు ఫేక్ ప్రచారం జరుగుతోందని.. దానిని ఎవరు నమ్మెద్దని.. కర్నాటక నెక్ట్స్ సీఎం ఎవరనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ప్రకటిస్తారని తెలిపారు. సీఎం ఎంపిక అంశంపై ఇవాళ లేదా రేపు అధికారిక ప్రకటన చేస్తామన్నారు. ప్రమాణ స్వీకారంపై కూడా ఫేక్ డేట్స్ ప్రచారమవుతున్నాయని.. వాటిని ఎవరూ నమ్మెద్దని కోరారు. దీంతో కర్నాటక సీఎం ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read..

బ్రేకింగ్: కర్నాటక నెక్ట్స్ సీఎం ఆయనే.. ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన..!

Next Story

Most Viewed