Muhammad Younis: ఎవరీ మహ్మద్ యూనుస్..బంగ్లాదేశ్ భారత్‌కు బద్ధ శత్రువుగా ఎందుకు మారుతోంది..?

by Vennela |

Muhammad Younis: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన మంత్రి మహ్మద్ యూనిస్ ఈ మధ్యకాలంలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదంగా మారిపోయారు.

Muhammad Younis: ఎవరీ మహ్మద్ యూనుస్..బంగ్లాదేశ్  భారత్‌కు బద్ధ శత్రువుగా ఎందుకు మారుతోంది..?
X

దిశ, వెబ్ డెస్క్: Muhammad Younis: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన మంత్రి మహ్మద్ యూనిస్ ఈ మధ్యకాలంలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదంగా మారిపోయారు. చైనాతో మైత్రి సంబంధాలను కొనసాగిస్తూ భారత ఉపఖండంలో కొత్త కుట్రలకు తెర లేపారని మహ్మద్ యూనిస్ పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఉపఖండంలో అశాంతిని రాజేసేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒకప్పుడు మైత్రి బంధం బలంగా ఉండేది. ఇది బీటలు వాడడానికి ప్రధాన కారణం మహమ్మద్ యూనిస్ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు ప్రముఖ ఆర్థికవేత్తగాను సామాజిక కార్యకర్తగాను, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఆద్యుడిగా పేరుపొందిన మహ్మద్ యూనుస్ గ్రామీణ్ బ్యాంకును స్థాపించి పేదలకు ఆర్థిక సహాయం అందించడంలో సరికొత్త విప్లవం సృష్టించారు.

ఆయన కృషికి గాను నోబెల్ బహుమతి లభించింది. రాజకీయ సంక్షోభం కారణంగా మరోసారి మహమ్మద్ యూనిస్ ఆ దేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన వ్యవహార శైలి పూర్తిగా భారత వ్యతిరేకంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఆయన ఈశాన్య రాష్ట్రాల పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చైనాలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలు సముద్ర తీరం లేని ప్రాంతాలని బంగ్లాదేశ్ ఈ ప్రాంతానికి సముద్ర తీరం అందించే ఏకైక దిక్కుగా వర్ణించారు.

దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు మహమ్మద్ యూనిస్ ఇటీవల చైనాతో సఖ్యతగా ఉంటూ భారత్ పై విషం చిమ్ముతూ అనేక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా భారతీయుల అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్ బంగ్లాదేశ్ పైన ల్యాండ్ పోర్టు ద్వారా సరుకుల రవాణాను నిషేధిస్తూ ఆంక్షలు విధించింది. ఈ దెబ్బతో బంగ్లాదేశ్ కు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

Next Story