రోజు రోజుకు పెరుగుతున్న దగ్గు సిరప్‌ మరణాలు.. పిల్లల మరణాలపై WHO ఆందోళన

by Malleboina Mahesh |

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో కోల్డ్‌రిఫ్ (Coldrif) కాఫ్ సిరప్ వల్ల పిల్లలు అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే.

రోజు రోజుకు పెరుగుతున్న దగ్గు సిరప్‌ మరణాలు.. పిల్లల మరణాలపై WHO ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో కోల్డ్‌రిఫ్ (Coldrif) కాఫ్ సిరప్ వల్ల పిల్లలు అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో దేశంలో ఆందోళన కలిగిస్తుంది. దీంతో అప్రమత్తం అయిన ఇతర రాష్ట్రాలు వెంటనే.. కోల్డ్‌రిఫ్ కాఫ్ సిరప్ సహా దాని అనుభంద సిరప్ లపై వెంటనే నిషేధం విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సిరప్ ఉపయోగించిన పిల్లలు అనారోగ్యం కారణంగా రోజుకొకరు మృతి చెందుతుండటం షాక్ కు గురి చేస్తుంది.

భారత్‌లో పిల్లల మరణాలపై WHO ఆందోళన వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 29 వ తేదీ వారం నుంచి వెలువడిన ఈ నివేదికల్లో పిల్లలకు తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం (Acute Renal Failure) ఎన్‌సెఫలిటిస్ సిండ్రోమ్ (Acute Encephalitis Syndrome) వంటి లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యాధులు కొన్ని మౌఖిక సిరప్ మందుల వాడకంతో సంబంధం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది.

అక్టోబర్ 1, 2025న WHO, భారత కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (CDSCO)తో సంప్రదింపులు జరిపి, ఈ ఘటనలకు కలుషిత మందుల సంబంధం ఉందా? ఆ మందులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయా? అనే విషయాలపై వివరణ కోరింది. డబ్ల్యూహెచ్‌ఓ భారత అధికారులకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. తాజాగా అక్టోబర్ 8, 2025న సీడీఎస్‌సీఓ నుండి డబ్ల్యూహెచ్‌ఓకి వచ్చిన నివేదిక ప్రకారం.. కనీసం మూడు మౌఖిక సిరప్ మందుల్లో డైఎథిలీన్ గ్లైకాల్ (Diethylene Glycol - DEG) అనే విషపదార్థం గుర్తించబడింది. ఈ మందుల వాడకం వల్లే అనుమానిత పిల్లల మరణాలు సంభవించినట్లు సమాచారం ఇచ్చింది.

Next Story