నితీశ్‌ను ఆల్‌రౌండర్ అంటారా? నిలదీసిన మాజీ లెజెండ్

by Phanindra |   (  Updated:2025-11-25 19:03:32  IST  )

నితీశ్‌ను ఆల్‌రౌండర్ అంటారా? అని టీమిండియా సెలెక్టర్లను మాజీ లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ నిలదీశాడు.

నితీశ్‌ను ఆల్‌రౌండర్ అంటారా? నిలదీసిన మాజీ లెజెండ్
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌పై మాజీ లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు చేశారు. నితీశ్ ఇంకా మెరుగవ్వాలని, అప్పుడే టీమిండియాకు ఆడే స్థాయి అతనికి లేదన్నాడు. అక్షర్ పటేల్ వంటి ప్లేయర్‌ను పక్కన పెట్టి నితీశ్‌ను తీసుకోవడం ఏంటని ప్రశ్నించాడు. ముఖ్యంగా స్వదేశీ పరిస్థితుల్లో నితీశ్ రికార్డు ఏమాత్రం బాగలేదని, అలాంటి ప్లేయర్‌ను వన్డేలకు కూడా తీసుకోవడమేంటని నిలదీశాడు. ‘అసలు నితీశ్ రెడ్డి ఆల్‌రౌండరా? తన బౌలింగ్‌ చూసి, ఎవరైనా అతన్ని ఆల్‌రౌండర్ అంటారా? ఎంసీజీలో సెంచరీ చేశాడు సరే.. ఆ తర్వాత ఏం చేశాడు? నితీశ్ ఆల్‌రౌండర్ అయితే నేను గ్రేట్ ఆల్‌రౌండర్‌ని’ అని శ్రీకాంత్ విమర్శలు చేశాడు. ‘తన బౌలింగ్‌లో మూవ్‌మెంట్ ఉందా? పేస్ ఉందా? తనేం డెడ్లీ బ్యాట్స్‌మెన్ కూడా కాదు. అలాంటి వాడు వన్డేల్లో ఎలా సెలెక్ట్ అయ్యాడు? తను ఏం సాధించాడు? హార్దిక్ పాండ్యా ప్లేస్‌లో అతన్ని ఆడిస్తున్నారా? అక్షర్‌ను ఎందుకు తీసుకోవట్లేదు?’ అని శ్రీకాంత్ ప్రశ్నించాడు.

గంభీర్ ఏదైనా మాట్లాడొచ్చు.. కానీ..

గువాహతి టెస్టులో టీమిండియా ఓటమి ముంగిట నిలిచిన వేళ.. గౌతం గంభీర్‌ను కూడా శ్రీకాంత్ టార్గెట్ చేశాడు. ‘ప్రతి రెండో మ్యాచులో ఎవరో ఒకరు అరంగేట్రం చేస్తున్నారు. ట్రయల్ అండ్ ఎర్రర్ అని వాళ్లు చెప్పొచ్చు. గంభీర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడొచ్చు. కానీ నాకనవసరం. నేను మాజీ కెప్టెన్‌ని, మాజీ చీఫ్ సెలెక్టర్‌ను. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. జట్టులో కన్‌సిస్టెన్సీ అవసరం’ అని శ్రీకాంత్ చెప్పాడు.

Next Story