- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయేల్ బంధీలను విడుదల చేయనున్న హమాస్.. మీడియాకు లీకైన లిస్టు
ఇప్పటికే విడుదల కానున్న బంధీల కుటుంబాలను ఇజ్రాయేల్ ప్రభుత్వం గుర్తించి వారికి సమాచారం కూడా అందించింది.

- తొలి దశలో 33 మంది బందీల విడుదల
- ఆరు వారాల్లోగా విడుదల చేసే అవకాశం!
దిశ, నేషనల్ బ్యూరో:
మొదట దశ కాల్పుల విరమణలో భాగంగా 33 మంది ఇజ్రాయేలీ బంధీలను హమాస్ విడుదల చేయనుంది. వీరిలో 10 మంది మహిళలు, 10 మంది వృద్ధులు, ఇద్దరు పిల్లలతో పాటు 11 మంది గాయపడిన యువకులు కూడా ఉన్నారు. ఈ 33 మంది రాబోయే ఆరు వారాల్లో విడుదల కానున్నట్లు ఇజ్రాయేలీ మీడియా పేర్కొంది. కాగా, విడుదల కానున్న వారిలో అందరూ జీవించే ఉన్నట్లు భావిస్తున్నామని ఇజ్రాయేలీ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే హమాస్ మాత్రం ఇంత వరకు విడుదల చేయనున్న బంధీల పరిస్థితి ఏంటనేది వెల్లడించలేదు. కాగా, విడుదలకు ఒక రోజు ముందు బంధీల వివరాలను వెల్లడించనున్నట్లు హమాస్ ప్రతినిధులు పేర్కొన్నారు. జీవించి ఉన్న వారిని ముందుగా అప్పగించాలని ఇజ్రాయేల్ ఒత్తిడి తెచ్చింది. చనిపోయిన వారి మృతదేహాలను తర్వాత దశలో అప్పగించాలని డిమాండ్ చేస్తోంది
ఇప్పటికే విడుదల కానున్న బంధీల కుటుంబాలను ఇజ్రాయేల్ ప్రభుత్వం గుర్తించి వారికి సమాచారం కూడా అందించింది. విడుదల కానున్న వారి పేర్లను ఇజ్రాయేల్ ప్రభుత్వం మీడియాకు విడుదల చేయలేదు. అయితే హమాస్‌తో చర్చలు జరపడానికి మధ్య వర్తులకు ఇచ్చిన లిస్ట్ లీకైందని.. ఆ పేర్లే మీడియాలో వస్తున్నాయని ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెబుతున్నారు. ఈ 33 మందిని దశల వారీగా విడుదల చేస్తారని.. తొలి రోజు ముగ్గురు హమాస్ చెర నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ప్రతీ వారం నలుగురి చొప్పున విడుదల చేస్తారు. ఆరో వారం మిగిలిన 14 మంది బయటకు వస్తారని తెలుస్తోంది. కాగా హమాస్ ఈ 33 మందితో పాటు మరో 65 మందిని కూడా బంధీలుగా చేసుకుంది. కానీ వారంతా చనిపోయి ఉంటారని ఇజ్రాయేల్ భావిస్తోంది.






