- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నో శాంతి ఒప్పందాలు చేశారు.. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో యుద్ధాలు ఆపారని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వైట్‌హౌజ్ పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ ప్రెసిడెంట్‌గా అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా ప్రతి నెలా ఒక సీజ్‌ఫైర్ డీల్ చేయించారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ అన్నారు. థాయ్‌లాండ్-కంబోడియా సీజ్‌ఫైర్ గురించి మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ఎలాంటి కండిషన్స్ లేకుండా సీజ్‌ఫైర్ జరగడంలో ప్రెసిడెంట్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు.
ఈ రెండు దేశాల మధ్య సంక్షోభంతో 3 లక్షల మందికిపైగా ప్రజలు శరణార్థులుగా మారాల్సి వచ్చింది. దీన్ని ట్రంప్ ఆపారు’ అని వివరించారు. ఇప్పటి వరకు థాయ్‌లాండ్-కంబోడియా, ఇజ్రాయెల్-ఇరాన్, ర్వాండా-డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఇండియా-పాకిస్తాన్, సెర్బియా-కోసావో, ఈజిప్ట్-ఇథియోపియా మధ్య యుద్ధాలు ఆపారని కరోలైన్ తెలిపారు.
‘ఆరు నెలల పాలనలో ప్రెసిడెంట్ ట్రంప్ దాదాపు నెలకు ఒక సంక్షోభాన్ని ఆపారు. ఇప్పటికైనా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి’ అని ఆమె అన్నారు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖను ప్రశ్నించగా.. ‘ఈ శాంతి బహుమతి ప్రశ్నలన్నీ నేరుగా వైట్ హౌజ్‌ను అడగండి’ అని పేర్కొంది.






