- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Donald trump: ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ కీలక ప్రకటన
by Ajay Maddhiboyina |
ట్రంప్ ఆరోగ్యంపై అనేక వార్తలు పుట్టుకొస్తున్న వేళ వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ తన వర్జీనియా క్లబ్‌లో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: ట్రంప్ ఆరోగ్యంపై అనేక వార్తలు పుట్టుకొస్తున్న వేళ వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ తన వర్జీనియా క్లబ్‌లో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన హుషారుగా గోల్ఫ్ కూడా ఆడుతున్నారని పేర్కొంది. ఫోటోలో ట్రంప్ తెల్లటి పోలో షర్ట్, రెడ్ కలర్ టోపీ మరియు బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నారు.
తెల్లవారు జామున ఉదయం 8.49 గంటలకు ట్రంప్ గోల్ఫ్ ఆడినట్టు టైం స్టాంప్ కనిపిస్తోంది. ఇక ట్రంప్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నేడు ట్రంప్ డెడ్ అంటూ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వైట్ హౌస్ ప్రకటనతో ట్రంప్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






