Lakshmi Menon: బూతులు తిడుతూ ఐటీ ఉద్యోగిపై దాడి.. హీరోయిన్ లక్ష్మీ మీనన్ ఎక్కడ?

by Prasad Jukanti |

ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నటి లక్ష్మి మేనన్ ఇంకా పరారీలోనే ఉన్నారు.

Lakshmi Menon: బూతులు తిడుతూ ఐటీ ఉద్యోగిపై దాడి.. హీరోయిన్ లక్ష్మీ మీనన్ ఎక్కడ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నటి లక్ష్మి మేనన్ (Lakshmi Menon) ఇంకా పరారీలోనే ఉన్నారు. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి అతడిపై దాడి చేశారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 24 వ తేదీ రాత్రి లక్ష్మీ మేనన్, తన స్నేహితులతో కలిసి ఓ రెస్టో బార్ కు వెళ్లారు. అక్కడ మిత్రులతో ఉన్న ఓ ఐటీ ఉద్యోగితో వారికి గొడవ జరిగింది. ఆ గొడవ అక్కడితో సుద్దుమణగకపోవడంతో నటి, ఆమె స్నేహితులు సదరు ఐటీ ఉద్యోగిని తన కారులో బలవంతంగా ఎక్కించుకుని దాడి చేశారు. బూతులు తిడుతూ హింసించారు. ఆ తర్వాత మరో చోట వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి నుంచి లక్ష్మీ మేనన్ పరారీలో ఉంది.

ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు అరెస్టు కాగా నిందితుల్లో ఒకరిగా ఉన్న లక్ష్మీ మేనన్ మాత్రం పరారీలో ఉందని కొచ్చి పోలీసులు తెలిపారు. అయితే తనను అరెస్టు చేయవద్దని లక్ష్మీ మేనన్ తరఫున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమెకు కేరళ హైకోర్టు (Kerala High Court) ఊరట కల్పించింది. సెప్టెంబర్ 17 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకు ఆమెను అరెస్టు చేయవద్దని పోలీసులకు సూచించిది. కాగా ప్రస్తుతం లక్ష్మీ మేనన్ ఎక్కడ ఉందని అనేది పోలీసులకు చాలెంజ్ గా మారింది.

Next Story